వర్మీ కంపోస్ట్ యూనిట్లతో పంచాయతీలకు ఆదాయం
వర్మీ కంపోస్ట్ యూనిట్లతో పంచాయతీలకు ఆదాయం
Published Wed, Feb 22 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
కరప (కాకినాడ రూరల్) : గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చెత్త సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం రీసోర్స్ పర్స¯ŒS ఎ.రవిశంకర్ సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన మండల గ్రామకార్యదర్శులతో సమావేశమై వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. యూనిట్ నిర్మాణానికి ఉపాధి నిధులు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 100 వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్మాణలో ఉన్నాయని ఆయన తెలిపారు. కరపలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి మండలానికి 5 యూనిట్లు నిర్మిస్తామన్నారు. 42 యూనిట్లు పూర్తికాగా 40 యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంతవరకు వర్మీకంపోస్ట్ యూనిట్ల ద్వారా 35 టన్నుల సేంద్రియ ఎరువు తయారైందన్నారు. ఒక టన్ను సేంద్రియ ఎరువు అమ్మితే రూ.8 వేలు వస్తుందన్నారు. గ్రామంలో చెత్త సేకరణకు హరిత రాయబారుల (ఉపాధి కూలీల)ను నియమిస్తామని చెప్పారు. వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారి ఉంటారన్నారు. ఇ¯ŒSచార్జ్ ఎంపీడీఓ గుత్తుల భీమశంకరరావు, ఈఓపీఆర్డీ సీహెచ్ వెంకటబాలాజీ, ఎఫ్‌డీసీ టి.రవికాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement