ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కోశాధికారి కార్యాలయం నుంచి నిధుల చెల్లింపుపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం సాయంత్రం ట్రెజరీ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జీతాలతోపాటు కొన్ని అత్యవసర బిల్లులు తప్పితే మిగతా అన్ని చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఈనెల 12 వరకు బిల్లుల చెల్లింపులు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై రెవెన్యూ భారం పడకుండా తాత్కాలికంగా ఈ ఫ్రీజింగ్ విధించినట్లు సమాచారం.
మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఉద్యోగుల జీతాలు, ఆస్పత్రి, జైలు, హాస్టల్ డైట్ చార్జీలు, జీపీఎఫ్, లోన్స్ అండ్ అడ్వాన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు మినహా మిగతా అన్నింటిపై ఫ్రీజింగ్ విధించారు. గురువారం నుంచి ఇది అమల్లోకి రానుంది. పలు బిల్లుల చెల్లింపులు జరగవు. ప్రయాణ భత్యం, ఆఫీసు సాధారణ నిర్వహణ ఖర్చులు, టెలిఫోన్, విద్యుత్ శాఖ బిల్లులు, కార్యాలయ భవనాల అద్దెలు, వాహన అద్దె, పెట్రోల్‌కు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉండగా మార్చి 31లోగా మిగులు బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలి.
నిధులు ఫ్రీజింగ్!
Published Thu, Mar 6 2014 12:31 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement