ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలంలోని కోయచెలకలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కె. నవీన(25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
Published Wed, Jul 5 2017 11:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
Advertisement
Advertisement