
వర్మ కొత్త కథానాయిక
ఇటీవలే ‘ఐస్‌క్రీమ్’ మేకింగ్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన రామ్‌గోపాల్ వర్మ, మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. వర్మ నూతనంగా ఏర్పాటు చేసిన ‘న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ ద్వారా నిర్మాణమవుతోన్న తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన అనే కొత్తమ్మాయిని వర్మ నాయికగా పరిచయం చేస్తున్నారు. జేడీ చక్రవర్తి, జీవా, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు.