సర్‌ప్రైజ్‌ సీమంతం.. ఏడ్చేసిన బుల్లితెర నటి | TV Serial Actress Maheshwari Husband Shivanag Arranged Surprise Baby Shower Function To Her, Video Viral - Sakshi
Sakshi News home page

Maheshwari Baby Shower Video: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

Published Sun, Mar 3 2024 11:10 AM | Last Updated on Mon, Apr 8 2024 12:02 PM

Mahishivan: Surprise Baby Shower to TV Actress Maheshwari - Sakshi

సీరియల్స్‌లో యాక్ట్‌ చేసినవారిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఒకవేళ వారు యాక్టింగ్‌కు దూరంగా ఉన్నా సరే ఫలానా సీరియల్‌లో ఈ పాత్ర చేశారు, ఆ పాత్రలో భలే కనిపించారు అంటూ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. యూట్యూబ్‌లోనూ సొంతంగా ఛానల్‌ ఓపెన్‌ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్‌ చేసుకుంటున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది.

రెండోసారి ప్రెగ్నెంట్‌
వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది మహీశ్వరి. ఫ్యామిలీ నెంబర్‌ 1, ఇస్మార్ట్‌ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆమె భర్త శివనాగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది. త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఓ బుజ్జి పాపాయి రానుంది. మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు శివ.

సర్‌ప్రైజ్‌ సీమంతం..
ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్‌ చేశాడు. భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్‌ కూడా చేశాడు. బోటింగ్‌కు వెళ్తున్నాం.. అని చెప్పి వారిని నేరుగా ఓ ఈవెంట్‌ హాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ కనిపించడంతో షాకైంది నటి. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు.

ఎమోషనలైన నటి
ఈ సర్‌ప్రైజ్‌ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మహేశ్వరి- శివ కేక్‌ కట్‌ చేశారు. ఆ కేక్‌ కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేయించారు. భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్‌ కట్‌ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్‌ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సిద్దార్థ్‌వర్మ - విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్‌ రవి హాజరయ్యారు.

చదవండి: తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్‌' డ్యాన్స్‌.. ఫిదా అవుతున్న బాలీవుడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement