నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఆ మధ్య పలు షోలు చేస్తూ బుల్లితెరపై సందడి చేసిన ఆమె తర్వాత సినిమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇటీవలే బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి చేజారుతున్నవ్‌రో అనే ప్రైవేట్ సాంగ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఎప్పుడూ ఫొటోషూట్స్‌తో బిజీగా ఉండే విష్ణుప్రియ దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది.
తాజాగా విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ స్టోరీలో మహిళల నగ్న ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు ఫొటోలతో పాటు కొన్ని అశ్లీల వీడియోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. విష్ణుప్రియ ఇలాంటివి పోస్ట్ చేసిందేంటని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై విష్ణుప్రియ స్పందించింది. 'అసలేం జరిగింది అంటూ పొద్దున్నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయింది. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా ఇంకా నా అకౌంట్ నా చేతికి రాలేదు. ఇప్పటికే ఇలా రెండుసార్లు జరిగింది. ఆ పేజీని రిపోర్ట్ చేయండి. అన్‌ఫాలో చేయండి. నా పేజీలో అశ్లీల కంటెంట్ రావడంతో మీరు చాలా ఇబ్బందిపడ్డారు. అందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. నా అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని దయచేసి అందరికీ తెలియజేయండి' అని కోరింది.
చదవండి: మోకాళ్లపై తిరుపతి మెట్లెక్కిన హీరోయిన్
కంటెస్టెంట్లను పస్తులుంచిన బిగ్‌బాస్
నటి ఆత్మహత్య కేసు, దంపతులను పట్టిస్తే రివార్డ్
Comments
Please login to add a commentAdd a comment