Vishnu Priya Looks Like Late Silk Smitha Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Silk Smitha Lookalike Photos: అచ్చం సిల్క్‌స్మితలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

May 6 2023 12:02 PM | Updated on May 6 2023 12:56 PM

Vishnu Priya Looks Like Late Silk Smitha Photos Goes Viral - Sakshi

బోల్డ్‌ బ్యూటీ సిల్క్‌ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసిన ఆమె దశాబ్దానికి పైగా ఓ వెలుగు వెలిగింది. నిషా కళ్లు,హస్కీ వాయిస్‌, గ్లామర్‌తో హీరోయిన్లకు పోటీ ఇచ్చిన సిల్క్‌ స్మిత వారికి ధీటుగా స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా ఐటెం సాంగులతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిల్క్‌ దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ జతకట్టింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోస్ సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్‌ స్మిత 1996లో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అమ్మాయి అచ్చుగుద్దినట్లు సిల్క్‌ స్మితను పోలినట్లు ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జూనియర్‌ సిల్క్‌గా గుర్తింపు పొందిన ఆ అమ్మాయి పేరు విష్ణుప్రియ. చూడటానికి అచ్చం జిరాక్స్‌ కాపీలా ఉన్న ఆమె సిల్క్‌ స్మితను గుర్తుచేస్తుంది. నటిగా రాణించాలన్నది తన కోరిక అని, అంతేకాకుండా సిల్క్‌ స్మిత తన ఫ్యామిలీకి ఎంతో సహాయం చేసిందంటూ చెప్పుకొచ్చింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement