యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది.
ఇదిలా ఉంటే లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను మరోసారి గర్భవతి అయినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్య సీమంతం వేడుకలో బిగ్‌బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మ ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment