
సౌందర్య రజనీకాంత్‌కు సీమంతం
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య సీమంతం సోమవారం స్థానిక రాయపేటలోని పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి లో నిరాడంబరంగా నిర్వహించారు. సౌందర్య కు వ్యాపారవేత్త అశ్విన్‌కు 2010లో వివాహం జరిగింది. రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉం డాలని కోరుకుంటున్నానన్నారు. అదే వేదికపై తన తొలి చిత్రం విడుదలానంతరం నాన్న మాటను పాటిస్తానని సౌందర్య అన్నారు. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరం గా ఉన్న సౌందర్య ఇటీవల గర్భం దాల్చారు. ఆమె సీమంతాన్ని సోమవారం రజనీ కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు.