టిడిపి సీమంత రాజకీయం..! | tdp leaders play politics in janmabhumi programme | Sakshi
Sakshi News home page

టిడిపి సీమంత రాజకీయం..!

Published Wed, Nov 12 2014 1:06 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

టిడిపి సీమంత రాజకీయం..! - Sakshi

టిడిపి సీమంత రాజకీయం..!

జన్మభూమి - మా ఊరు సభలో భాగంగా గర్భిణులకు చేస్తున్న సీమంతంలోనూ అధికార పార్టీ రాజకీయ ప్రచారం చేస్తోంది. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వారికి చీర, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ వాయనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ ఫొటోలు ఉండటంతో జన్మభూమికి వచ్చిన పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. చివరికి సీమంతం కార్యక్రమాల్లో సైతం అధికార పార్టీ తమ ప్రచారం మానుకోలేదంటూ ఎద్దేవాచేస్తున్నారు.

- కృత్తివెన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement