kruthivennu mandal
-
దుండగులను అరెస్ట్ చేయొద్దంటూ టీడీపీ నేత ఒత్తిళ్లు
మచిలీపట్నం : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక ఒఎన్జీసీ ప్లాంటులో బుధవారం అర్థరాత్రి దుండగులు రూ. 30 లక్షల విలువైన ఇనుమును చోరీ చేశారు. ఆ విషయాన్ని ఓఎన్జీసీ భద్రత సిబ్బంది గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై... ఇనుము తరలిస్తున్న దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా సదరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నేత వెంటనే రంగంలోకి దిగి.. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయొద్దంటూ... పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అలాగే ఈ విషయం బయటకు రాకుండా చూడాలని ఓఎన్జీసీ అధికారులకు సదరు టీడీపీ నేత బెదిరించారని సమాచారం. -
టిడిపి సీమంత రాజకీయం..!
జన్మభూమి - మా ఊరు సభలో భాగంగా గర్భిణులకు చేస్తున్న సీమంతంలోనూ అధికార పార్టీ రాజకీయ ప్రచారం చేస్తోంది. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చీర, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ వాయనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ఫొటోలు ఉండటంతో జన్మభూమికి వచ్చిన పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. చివరికి సీమంతం కార్యక్రమాల్లో సైతం అధికార పార్టీ తమ ప్రచారం మానుకోలేదంటూ ఎద్దేవాచేస్తున్నారు. - కృత్తివెన్ను