దుండగులను అరెస్ట్ చేయొద్దంటూ టీడీపీ నేత ఒత్తిళ్లు | Rs. 30 Lakhs worth steel robbery in ongc plant in kruthivennu mandal | Sakshi
Sakshi News home page

దుండగులను అరెస్ట్ చేయొద్దంటూ టీడీపీ నేత ఒత్తిళ్లు

Published Thu, Apr 28 2016 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

Rs. 30 Lakhs worth steel robbery in ongc plant in kruthivennu mandal

మచిలీపట్నం : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక ఒఎన్జీసీ ప్లాంటులో బుధవారం అర్థరాత్రి దుండగులు రూ. 30 లక్షల విలువైన ఇనుమును చోరీ చేశారు. ఆ విషయాన్ని ఓఎన్జీసీ భద్రత సిబ్బంది గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై... ఇనుము తరలిస్తున్న దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా సదరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నేత వెంటనే రంగంలోకి దిగి.. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయొద్దంటూ... పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అలాగే ఈ విషయం బయటకు రాకుండా చూడాలని ఓఎన్జీసీ అధికారులకు సదరు టీడీపీ నేత బెదిరించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement