![Major Fire at ONGC Plant in Navi Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/3/EDgo69DUcAAtY2N.jpg.webp?itok=J_zvJC9a)
సాక్షి, ముంబై: నవీ ముంబైలోని ఉరాన్ ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. 50 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పైప్ నుంచి మంటలు అంటుకున్నాయి. ఓఎన్‌జీసీ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం వెంటనే స్పందించి అప్రమత్తమైంది. మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ఆయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభావం పడలేదు. గ్యాస్‌ను గుజరాత్‌లోని హజిరా ప్లాంట్‌కు తరలిస్తున్నాం. పరిస్థితిని అంచనా వేస్తున్నామ’ని ఓఎన్‌జీసీ ట్వీట్ చేశారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment