
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ గర్భవతి అనే సంగతి తెలిసిందే. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్ షోలోకి వెళ్లాడు. తొలుత వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ భార్య ఫోర్స్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు షో ప్రారంభం రోజు నటరాజ్ మాస్టర్ చెప్పారు.
తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు కానీ బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తాను అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. తాజాగా నీతూకు సీమంతం జరిపారు కుటుంబ సభ్యులు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలునవీన, శ్రీవాణి,అంజలి పవన్, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం సీమంతంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌అవుతున్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్ మాస్టర్ టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులందరితో కలిసి పని చేశాడు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత అతను తన భార్య నీతూతో కలిసి టీవీ షోలు, ఆడియో మరియు అవార్డు ఫంక్షన్లు వంటి 200 కి పైగా కార్యక్రమాలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment