సాక్షి, హైదరాబాద్: అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్‌లోని సామ నర్సింహా రెడ్డి గార్డెన్స్‌లో 1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు.
గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు అమ్మ ఫౌండేషన్ సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమని నర్సింహారెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామ స్వప్నసుందర్ రెడ్డి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్, సినీ నటి కవిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment