‘అమ్మ’సేవలు ఆదర్శవంతం
సామాజిక సేవా కార్యక్రమాల్లో ’అమ్మ ఫౌండేష¯ŒS’
పలు రంగాల్లో ఉచిత శిక్షణ
సామాజిక సేవా కార్యక్రమాలతో ‘అమ్మ’ ఫౌండేష¯ŒS పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, గృహిణులకు కుట్టు శిక్షణ, కారు డ్రైవింగ్ వంటి రంగాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అమ్మ ఫౌండేష¯ŒS రెండేళ్లుగా ముందుకు సాగుతోంది. నగరం ప్రధాన కేంద్రంగా మన జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ ఫౌండేష¯ŒS ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మాకనపాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 2014లో నగరం కేంద్రంగా అమ్మ ఫౌండేష¯ŒS ఏర్పాటు చేశారు. నగరంతో పాటు అప్పనపల్లి, అయినవిల్లి మండలం నేదునూరు, పెదపాలెం, అంబాజీపేట మండలం వక్కలంక కొత్తపేట మండలం వాడపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సీతారామపురంలో ఫౌండేష¯ŒS కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంప్యూటర్, కుట్టు శిక్షణ ఇస్తున్నారు.
– మామిడికుదురు
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు...
పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణలో అమ్మ ఫౌండేష¯ŒS విశేషంగా సేవలందిస్తోంది. అనాథ పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడంతో పాటు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్లు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్, గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఈ ఫౌండేష¯ŒS సభ్యులు విశేషంగా సేవలందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
సేవలకు నెలకు రూ.రెండు లక్షలు
పేద కుటుంబానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్నో కష్టాలు పడిన ఆయన పేదలకు తనవంతుగా సేవలందించాలని అమ్మ ఫౌండేష¯ŒSను ఏర్పాటు చేశారు. తనకు ఉన్న వాహనాల ద్వారా నెలకు రూ.4.50 లక్షల ఆదాయం వస్తోందని దానిలో రూ.రెండు లక్షలు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నానని నవీ¯ŒS చెప్పారు.
వృద్ధాశ్రమం ఏర్పాటే లక్ష్యం
వృద్ధుల కోసం భవనం నిర్మించి అందులో 50 మందికి ఆశ్రయం కల్పించాలన్నది నా అశయం. కుటుంబ సభ్యుల ఆదరణ నోచుకోనివారికి ఆసరాగా నిలవాలన్నది నా ప్రయత్నం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.
– మట్టపర్తి నవీ¯ŒS
కుట్టు శిక్షణతో ఉపాధి
అమ్మ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నా. నాతో పాటు ఎంతో మంది మహిళలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు.
– లక్కింశెట్టి సాయిసీతామహలక్ష్మి, శివకోడు