
సాక్షి, బెంగళూరు: ముప్పేట వరదలతో అతలాకుతలమైన కేరళకు నలువైపుల నుంచి ఆర్థిక సాయం వెల్లువెత్తుతోంది. రూ.10 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అమృతానందమయి చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరీందర్ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ప్రముఖ ప్రసార మాధ్యమ సంస్థ స్టార్ ఇండియా కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. రూ.25 లక్షల సాయం చేయనున్నట్లు ఆసియానెట్ ఉద్యోగులు చెప్పారు.