తిరువనంతపురం : కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. ఓవైపు ఊళ్లకు ఊళ్లు వరదలో మునిగిపోగా.. వరదనీటిలో మునిగి నాలుగైదురోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకా ఉన్నారు. వీరిని సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రక్షించే పనిలో ఉన్నాయి. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దైన్యంగా ఉంది. సరైన వసతుల్లేకపోవడంతోపాటు తమవారికి క్షేమసమాచారం అందించేందుకు ఏర్పాట్లు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కేరళ వరదలపై అప్‌డేట్స్ ఇవి:
బాబా రాందేవ్ రూ. 50 లక్షల సాయం
Relief material worth Rs.50 Lakh has been sent to flood affected areas of #Kerala & #Karnataka & we will be sending material worth Rs.1.5 crore more. Nation is proud of the rescue & relief operations conducted by our security forces in the flood affected areas: Yoga Guru Ramdev pic.twitter.com/U8iN6R8Y1N
— ANI (@ANI) August 20, 2018
- వరద బాధితుల కోసం ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు కొటిన్నర విలువ చేసే వస్తువులను కేరళ, కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సైన్యం చేపట్టిన సహాయక చర్యలను చూసి జాతీ గర్విస్తుందన్నారు.
కేసీఆర్‌కు కేరళ సీఎం కృతజ్ఞతలు
- వరద బాధితులకు ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో సహాయం అందించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.
నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన వెంకయ్య - వందేళ్లలో కనీవినీ ఎరుగని వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకోవడానికి వివిధ పార్టీలు, నాయకులు, ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కేరళ వరదలపై రాజ్యసభ డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన వెంకయ్య అనంతరం తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
- కేరళకోసం తాము సైతం అంటూ శివసేన పార్టీ ముందుకొచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
- తెలంగాణ స్టేట్ ఐఏఎస్ సంఘం ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించింది.
- భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన కేరళలో క్రమంగా వాతావరణం కుదుటపడే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. మరో నాలుగురోజులపాటు కేరళకు వర్షం రాకపోవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను వెనక్కు తీసుకున్నారు.ఇప్పటి వరకూ 400 మందికి పైగా మృతి చెందారు. 6లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పునరావాస కేంద్రాల్లో కేరళ వాసులకు తాత్కాలిక ఉపశమనం
- వరదనీటిలో మునిగి నాలుగైదురోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నవారిని ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర బృందాలు పునరావస కేంద్రాలకు తరలించారు. దీంతో వారికి తాత్కాలిక ఉపశమనం లభించింద
ఆహారం వద్దు.. ఎలక్ట్రీషియన్స్ కావాలి
- భారీ వర్షాలతో విద్యుత్ వ్యవస్థ నాశనమైంది. ఇళ్లలో విద్యుత్ లేక జనాలు బిక్కుబిక్కుమంటూ చీకటిలో కాలం వెల్లదీస్తున్నారు. ‘కేరళకు ఇప్పుడు దుస్తులు, ఆహారం అవసరంలేదు. అక్కడ ఇళ్లల్లో విద్యుత్ లేదు. కేరళకు పూర్వవైభవం తీసుకురావడానికి తక్షణం వేల సంఖ్యల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ , కార్పెంటర్స్ కావాలి. ఆయా విభాగాల్లోని నిపుణులు కేరళకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కేజే ఆల్పోన్స్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment