mata amritanandamayi
-
వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం
సాక్షి, బెంగళూరు: ముప్పేట వరదలతో అతలాకుతలమైన కేరళకు నలువైపుల నుంచి ఆర్థిక సాయం వెల్లువెత్తుతోంది. రూ.10 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అమృతానందమయి చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరీందర్ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ప్రముఖ ప్రసార మాధ్యమ సంస్థ స్టార్ ఇండియా కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. రూ.25 లక్షల సాయం చేయనున్నట్లు ఆసియానెట్ ఉద్యోగులు చెప్పారు. -
మాతా అమృతానందమయిపై వివాదాస్పద ట్వీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అసభ్య పదజాలంతో ట్వీట్లు చేశారు. ‘మాతా అమృతానందమయి మాకు కౌగిలింతలు కావాలి. ఇప్పటి వరకూ 32 మిలియన్ల కౌగిలింతలు ఇచ్చారు’ అంటూ ట్వీట్ చేశారు. గత ఏడాదిగా ట్వీటర్కు దూరంగా ఉంటున్న కాన్యే ఇటీవల తన ఖాతాను రీఓపెన్ చేసి మాతా అమృతానందమయిపై ఈ విధంగా ట్వీట్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి తన వద్దకు వచ్చిన భక్తులకు కౌగిలింతలు ద్వారా వారిని ఆశీర్వదిస్తారు. దీనిపై ఆమె స్పందిస్తూ... తన వద్దకు వచ్చే భక్తులు చాలా విషాదంతో వస్తుంటారని, వారి సమస్యలతో తన వద్ద కన్నీరు పెట్టుకుంటారిని భక్తులను వారి సమస్యల నుంచి దారి మళ్లించుటకు తాను ప్రేమతో కౌగిలించుకుంటానని తెలిపారు. అదే భక్తులకు తనపై ఉన్న నమ్మకంగా పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మాతా అమృతానందమయికి 3.4 కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్పుకుంటారు. -
అమృతానందమయికి జెడ్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఆధ్మాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయికి కేంద్రం ‘జెడ్ కేటగిరీ’ భద్రతను కేటాయించింది. దీంతో అనుక్షణం ఆమె వెన్నంటి 24 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. యోగా గురువు బాబా రాందేవ్ తరువాత జెడ్ కేటగిరీ భద్రత పొందిన రెండో ఆధ్యాత్మిక వేత్త మాతానే. మాతాకు, ఆమె ఆశ్రమానికి ప్రత్యేక శిక్షణ పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ కాపలాగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాతాకు ఆశ్రమం చుట్టుపక్కలే ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎక్కడికైనా ప్రయాణిస్తే కాన్వాయ్‌లో రెండు ఎస్కార్ట్ వాహనాలుంటాయి. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి విజయ్ సాంప్లాకు ‘వై ప్లస్’ భద్రతను కల్పించారు. -
'ఇంటర్నెట్ ఆధారిత జీవనం ప్రమాదకరం'
హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక విలువలు పడిపోతున్నాయని, ధనార్జనే ధ్యేయంగా ఎంత క్రూరత్వానికైనా సిద్దపడుతున్నారని ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి అన్నారు. భారతదేశ యాత్రలో భాగంగా అమ్మ ఆదివారం నగరంలోని మహేంద్రహిల్స్‌లోని ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నేటి తరం వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారని అన్నారు. ప్రస్తుతం అంతా ఇంటర్నెట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, ప్రజల్లో ధ్యానం, భక్తి, యోగాసానాలు వేయడం, ప్రవచనాలు వినడం, భజనలు చేయడం చాలా తగ్గిపోయాయని, సేవా గుణాన్ని మరిచిపోతున్నారని మాతా అమృతానందమయి ఆవేదన వ్యక్తం చేశారు. తోటివారిని ప్రేమతో దగ్గరకు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమ్మ విద్యామృతం పథకం కిదం దాదాపు వెయ్యిమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, 500 ల మంది వితంతువులకు పింఛన్లు అందజేశారు. -
విలువలను బతికించుకోవాలి...
మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది. భారతదేశం తరపున ఆధ్యాత్మిక సౌరభాలను ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నారు మాతా అమృతానందమయి. కేరళ వాసి అయినప్పటికీ మన రాష్ట్రంలోని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రబోధకురాలు ఇటీవలే అరవై వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘అమృతవర్షం 60’ పేరుతో కేరళలోని కొల్లం గ్రామంలో నిర్వహించిన మూడు రోజుల వేడుకకు హాజరైన లక్షలాదిమంది భక్తులకు తన ఆలింగన భాగ్యం కలిగించిన మాతా అమృతానందమయి సమాజహితమైన సందేశాన్ని సైతం అందించారు. ఆమె సందేశంలోని ముఖ్యాంశాలివి... వీరులు కావాలి మన దేశానికి ఇప్పుడు వీరులు కావాలి. ప్రేమశక్తితో భయరహితంగా ధైర్యంతో ముందుకు వెళ్లేవారు కావాలి. అయితే దీని అర్థం ఒక వ్యక్తి తన శక్తితో మరొకర్ని ఓడించాలనో, ఇతరుల రాజ్యాలను గెలుచుకోవాలనో కాదు. నాణ్యమైన నాయకత్వాన్ని అందించాలని. ఆధ్యాత్మిక విలువలు అవసరం మనుషులు శాంతి, సామరస్యాలతో లేనప్పుడు అభివృద్ధి ఉన్నా ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అర్థం. అభివృద్ధితో పాటుగానే మనకు ఆధ్యాత్మిక సంస్కృతి, విశ్వవ్యాపితమైన విలువలు అవసరం. మనసుల మధ్య దూరం... సాంకేతిక పరిజ్ఞానం మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని రెట్టింపు జేస్తోంది. అవి మనం సృష్టించినవే అని మరిచిపోవద్దు. వీటినుంచి సంతోషాన్ని వెతుక్కోవడం సరైన విధానం కాదు. జీవితాన్ని ఆనందించే సమయం... ఇప్పుడు సమయాన్ని ఆదా చేసే ఉత్పత్తులు రోజుకొకటి వస్తున్నాయి. గతంలోలా జీవితాన్ని ఆనందించే సమయం, సందర్భాలు మనకు లేకుండా పోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉంటున్నాయి. కాని వారికి ఆడుకునే సమయం ఉండడం లేదు. మన చేతలకు, మన సాంస్కృతిక విలువలకు సంబంధం లేకపోతే అది ఒక పనిచేయని బ్యాటరీ కలిగిన మొబైల్‌ఫోన్‌ను వినియోగించడం లాంటిదే. అది కేవలం ఇతరులకు చూపించడానికి మాత్రమే తప్పితే మరెందుకూ పనికి రాదు. నిశ్చలమైన వేదిక నిర్మించుకోవాలి... మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది. అది తరచు ఊగే వేదికలాగ మారకూడదంటే... మనలో అంతరాంతరాల్లో ఒక నిశ్చలమైన వేదికను నిర్మించుకోవాలి. విలువల్ని బతికించుకోవాలి. ఒంటరి మనసులకు కుటుంబ చికిత్స... ఒకప్పుడు కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికీ భద్రత లభించేది. దాంతో సమస్యల్ని సులువుగా ఎదుర్కోగలిగేవారు. ఆధునిక సమాజంలో పరిమిత కుటుంబాల కారణంగా ఒంటరితనం అనే వ్యాధితో, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగుతున్నారు. చిన్న విషయాలను కూడా భరించలేని వారు ఎక్కువయ్యారు. సామాజిక దృక్పథం ఉండాలి... మనం ఎప్పుడూ ఇతరుల తప్పులపైనే దృష్టిపెడతాం. ఇతరుల బలహీనతల విషయంలో మనం న్యాయమూర్తులం అవుతాం. అదే మన బలహీనతల విషయానికి వచ్చేసరికి మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తాం. అది సరైంది కాదు. దీనిని అర్థం చేసుకుంటే ఎందరినో మనం చేరువ చేసుకోగలం. ఒకప్పటి రోజుల్లో ప్రతి వ్యక్తిగత నిర్ణయం సమాజ బాధ్యతను అనుసరించి ఉండేది. వ్యక్తిగత లబ్దికోసం మాత్రమే ఆలోచించడం అంతిమంగా అందరికీ కీడు చేస్తుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే..! రామాయణమైనా మహాభారతమైనా లేక గత 1000 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నా... ఎందరో నియంతలు, రారాజులు... మహిళల పట్ల, అమ్మదనం పట్ల అమర్యాద కారణంగా తమ సామ్రాజ్యాలను సర్వనాశనం చేసుకున్నారు. అందుకే మనం వెంటనే చేయాల్సిన పని మన పిల్లల్లో విలువల పట్ల ప్రేమను పెంచడం. అలాగైతేనే ఈ పరిస్థితుల్లో మార్పు తేగలం. - సేకరణ: ఎస్.సత్యబాబు