
కాన్యే వెస్ట్, అమృతానందమయి (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అసభ్య పదజాలంతో ట్వీట్లు చేశారు. ‘మాతా అమృతానందమయి మాకు కౌగిలింతలు కావాలి. ఇప్పటి వరకూ 32 మిలియన్ల కౌగిలింతలు ఇచ్చారు’ అంటూ ట్వీట్ చేశారు. గత ఏడాదిగా ట్వీటర్‌కు దూరంగా ఉంటున్న కాన్యే ఇటీవల తన ఖాతాను రీఓపెన్ చేసి మాతా అమృతానందమయిపై ఈ విధంగా ట్వీట్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.
కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి తన వద్దకు వచ్చిన భక్తులకు కౌగిలింతలు ద్వారా వారిని ఆశీర్వదిస్తారు. దీనిపై ఆమె స్పందిస్తూ... తన వద్దకు వచ్చే భక్తులు చాలా విషాదంతో వస్తుంటారని, వారి సమస్యలతో తన వద్ద కన్నీరు పెట్టుకుంటారిని భక్తులను వారి సమస్యల నుంచి దారి మళ్లించుటకు తాను ప్రేమతో కౌగిలించుకుంటానని తెలిపారు. అదే భక్తులకు తనపై ఉన్న నమ్మకంగా పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మాతా అమృతానందమయికి 3.4 కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్పుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment