
ఎస్‌ఐ సుమారాణికి సీమంతం చేస్తున్న మహిళా సిబ్బంది
మండ్య: పోలీస్‌స్టేషన్‌లో మమతానురాగాలు వెల్లివిరిశాయి. గర్భిణి అయిన తమ అధికారిణికి సిబ్బంది సీమంతం నిర్వహించి పండంటి బిడ్డ పుట్టాలని దీవించారు. జిల్లాలోని పాండవపుర తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఎస్‌ఐగా సుమారాణి బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం కిత్రం వివాహం చేసుకున్న సుమారాణి ప్రస్తుతం గర్భిణి.
దీంతో ఆమెకు పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా సిబ్బంది శుక్రవారం ఘనంగా సీమంతం నిర్వహించారు.సహోద్యోగులు,సిబ్బంది కుటుంబ సభ్యులుగా మారి సీమంతం చేయడంతో ఎస్‌ఐ సుమారాణి భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment