స్నేహితుడి తలతో స్టేషన్కు వెళ్లి..
దొడ్డబళ్లాపురం: స్నేహితుడి తల నరికి నేరుగా స్టేషన్ కు వెళ్లి ఓ వ్యక్తి పోలీసులు అవాక్కయ్యేలా చేశాడు. ఓ పక్క తెగిపోయిన ఆ తల నుంచి రక్తపు బిందువులు స్టేషన్ లో పడుతుండగానే దానిని కిందపెట్టి తాను లొంగిపోతున్నట్లు చెప్పాడు. అతడు ఆ సమయంలో మద్యం మత్తులో కూడా ఉన్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కెంపతిమ్మనహళ్లికి చెందిన మంజునాథ్ (26) అనే వ్యక్తి ఉగనవాడి అనే గ్రామానికి చెందిన శశికుమార్ కు రూ.27వేలు అప్పు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మాట్లాడాలని చెప్పి మంజునాథ్‌ను ఉగనవాడి గ్రామం శివారు లోని ఓ నిర్జన ప్రదేశానికి పిలిచిన శశికుమార్.. అతడిని వేట కొడవలితో నరికేసాడు. అదే రాత్రి మంజునాథ్ తల తీసుకొని విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వారిని అవాక్కయ్యేలా చేశాడు. అనంతరం హత్య జరిగిన చోటుకి వెళ్లిన పోలీసులు మంజునాథ్ మొండాన్ని పోస్టుమార్టానికి తరలించారు.