గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్‌ | Rajeena acts with SJ Surya in Nenjam Marappathillai movie | Sakshi
Sakshi News home page

గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్‌

Published Thu, Aug 31 2017 7:21 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్‌

గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్‌

చెన్నై: గతంలో నేనొకరిని ప్రేమించా. ఆ కారణంగానే ఇలా మాట్లాడుతున్నా.. అంటోంది హీరోయిన్‌ రెజీనా కసంద్రా. కోలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్‌. తెలుగు, తమిళ చిత్రాలు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్‌ దర్శకత్ంలో ఎస్‌జే. సూర్యతో నటించిన నెంజమ్‌ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు.

‘జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్‌ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించినది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ తొందర పడటం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడటానికి కారణం ఏమిటీ, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను.

నేనిప్పుడిలా మాట్లాడటానికి అదే కారణం. అయినా ఆ విషయోల్లోకి వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. హీరోయిన్‌గా చిన్న గ్యాప్‌ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమైనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనసుపూర్తిగా నిర్ణయించుకున్నాను’  అని తన విషయాలను పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement