కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా! | Live for a few year a lone | Sakshi
Sakshi News home page

కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!e

Published Fri, Sep 1 2017 3:25 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!

కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!

తమిళసినిమా:  నేనొకరిని ప్రేమించాను ఆ కారణంగానే.. ఒంటరిగా ఉన్నా నంటోంది రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్‌. ముఖ్యంగా కోలీవుడ్‌లో మానగరం, రాజతందిరం, సరవణన్‌ ఇరుక్క భయమేన్, జెమినీగణేశనుమ్‌ సురళీరాజవుమ్‌ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌జే.సూర్యతో నటించిన నెంజమ్‌ మరప్పదిల్‌లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకిరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్‌ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించింది ఇది.

అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ నేను తొందర పడడం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడడానికి కారణం ఏమిటి, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడడానికి అదే కారణం. అయినా ఆ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా తెలివిగా ఉన్నాను. నటిగా చిన్న గ్యాప్‌ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది.అందుకే ఇంకా కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement