
జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్‌రాజ్, శివ, చంద్రన్ ముఖ్య తారలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పార్టీ’. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించారు. ప్రేమ్‌జీ అమరన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘సత్యరాజ్‌సార్ లాగా చాలా రోజుల తర్వాత డ్యూయెట్‌లు పాడాను. సినిమా మొత్తం నవ్వుతూ చేశాం. ప్రేక్షకులు కూడా నవ్వుకునేలా ఈ సినిమా సరదాగా ఉంటుంది’’ అన్నారు. ‘‘పార్టీ’ లాంటి ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. ఈ డైరెక్టర్‌తో మరిన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ’’ అన్నారు టి. శివ. ‘‘పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులతో ‘పార్టీ’ చిత్రం తెరకెక్కింది.
ప్రధానమంత్రి మోదీగారి స్పీచ్‌తో మొదలవుతుంది. ఇదే బ్యానర్‌లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వెంకట్ ప్రభు అన్నారు. ‘‘రమ్యకృష్ణగారిని రియల్‌గా చూడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా.. భయం కాదు కానీ బిడియంగా ఉంది’’ అన్నారు ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. ‘‘పార్టీ’ చిత్రం ద్వారా మా మనవడిని పరిచయం చేస్తున్నారు. తప్పక ఆదరించాలి. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే. ఒరిజినల్‌గా అలా ఉండను’’ అన్నారు సత్యరాజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్‌జీ, నటి సంచిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment