Sathya Raj
-
38 ఏళ్ల తర్వాత రజనీతో నటించనున్న కట్టప్ప
రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే భారీ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ శోభన.. రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో శృతిహాసన్ రజనీకాంత్‌కు కూతురిగా నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. ఇందులో రజనీకాంత్ గెటప్ ఆయన అభిమానులు అదుర్స్ అనేలా ఉంది. 38 ఏళ్ల తర్వాత..ఇకపోతే ఇందులో నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తాజా సమాచారం. వీరిద్దరూ 38 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారన్నమాట. ఇంతకు ముందు రజనీకాంత్, సత్యరాజ్ కలిసి తంబిక్కు ఎంద ఊరు, మూండ్రు ముగం, పాయుం పులి, నాన్ సిగప్పు మణిదన్, మిస్టర్ భరత్ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నింటిలోనూ సత్యరాజ్ విలన్‌గానే నటించారు. అప్పుడు తండ్రిగా.. ఇప్పుడు..మిస్టర్ భరత్ చిత్రంలో రజనీకాంత్‌కు తండ్రిగా నటించారు. అందులో ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా అనే పాట సూపర్‌హిట్ అయ్యింది. తొలిసారిగా కూలీ చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడిగా పాజిటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. దీంతో పడయప్పతో కట్టప్ప అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కూలీ చిత్రానికి గిరీశ్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది -
‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. బాహుబలి చిత్రంతో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో తండ్రి పాత్రలతో చేసి మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక బాహుబలితో కట్టప్పగా నేషనల్ స్టార్‌గా మారారు. అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కూతురు ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికే ఆయన కుమారుడు సిబిరాజ్ సినీరంగ ప్రవేశం చేశాడు. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించిన మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. స్టార్ నటుడి కూతురిగా మీడియా కంటపడకుండా పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచూ నెటిజన్లకు ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ సినీ ప్రియులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే తండ్రి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు తనకు తరచూ ఎదురవుతుంటాయట. దివ్య మాత్రం తన ప్రొఫెషన్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని, సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ సమాధానం ఇస్తుందని సన్నిహితుల నుంచి సమాచారం. View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) -
బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక
Legendary Actor Sathyaraj Hospitalized Suddenly Due To Coronavirus Positive: సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు మనోజ్, లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లకు కరోనా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా లెజండరి నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. కాగా ఇంతకు ముందు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదే విధంగా సండే లాక్‌డౌన్‌ను కూడా విధించారు. కరోనా కేసుల తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ -
హీరోగా ‘కట్టప్ప’కొడుకు.. ‘మాయోన్' ఫస్ట్ సింగిల్‌కి అనూహ్య స్పందన
సీనియర్ నటుడు సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగుకు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సత్యరాజ్ అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కట్టప్ప అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేశారు. ఇప్పుడు ఆయన తయయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మాయోన్' విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇలయరాజా సంగీతం అందరిని ఆకట్టుకుంటుంది. అంతే కాదు అన్ని వర్గాలు ప్రేక్షకులు ఈ పాటకు అనూహ్య స్పందన అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పాట తమిళ వెర్షన్ యూ ట్యూబ్ లో 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ పైగా అందుకోవడం విశేష. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదలవ్వనున్నాయి. -
పర్ఫెక్ట్ హజ్బెండ్
‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. ఆ సినిమా తర్వాత ఆయన ఎంత బిజీ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకూ పెద్ద తెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిసారి ఓ తమిళ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారు. ‘పర్ఫెక్ట్ హజ్బెండ్’ (పరిపూర్ణమైన భర్త) అనే వెబ్ సిరీస్‌లో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఇరట్టై సుళి’, ‘ఆన్ దేవదై’ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన తామిరా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధంతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఇందులో రేఖ, సీతా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లు కొనసాగనుందట. -
దొంగ వస్తున్నాడు
హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక, హీరో కార్తీ, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దొంగ’. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై సూరజ్ సదానా నిర్మించిన ఈ సినిమా డిసెంబరులో విడుదలకానుంది. కార్తీ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో మరో విభిన్న చిత్రం ‘దొంగ’. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నా. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. మా అన్న సూర్యగారు విడుదల చేసిన ‘దొంగ’ ఫస్ట్ లుక్‌కి, హీరో నాగార్జునగారు రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఆదివారం సెకండ్ లుక్‌ని రిలీజ్ చేశాం. నా కెరీర్లో మరచిపోలేని మరో చిత్రమిది’’ అన్నారు. ‘‘దొంగ’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత. -
రజనీ, కమల్‌పై విరుచుకుపడ్డ ‘కట్టప్ప’
సాక్షి, చెన్నై : తమిళ నాట రాజకీయ శూన్యత ఏమీ లేదంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌పై సత్యరాజ్ విరుచుకపడ్డారు. రాజకీయ శూన్యత ఏర్పడిందంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్హాసన్ల వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నట్లుగా చురకలంటించారు. -
అక్కా తమ్ముడైన అన్ని–మచ్చాన్
నిజ జీవితంలో అన్ని (వదిన)– మచ్చాన్ (మరిది) జ్యోతిక–కార్తీ ఓ సినిమా కోసం అక్కాతమ్ముళ్లుగా మారారు. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ ముఖ్య తారలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘‘అన్నితో తొలిసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీతూగారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇక మా టీమ్‌కు సత్యరాజ్ వంటి నటులు మరింత బలం’’ అని కార్తీ పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. సినిమాలో కార్తీ, జ్యోతికలకు సత్యరాజ్ తండ్రి పాత్ర చేస్తున్నారని కోలీవుడ్ టాక్. -
నవ్వుల పార్టీ
జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్‌రాజ్, శివ, చంద్రన్ ముఖ్య తారలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పార్టీ’. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించారు. ప్రేమ్‌జీ అమరన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘సత్యరాజ్సార్ లాగా చాలా రోజుల తర్వాత డ్యూయెట్లు పాడాను. సినిమా మొత్తం నవ్వుతూ చేశాం. ప్రేక్షకులు కూడా నవ్వుకునేలా ఈ సినిమా సరదాగా ఉంటుంది’’ అన్నారు. ‘‘పార్టీ’ లాంటి ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. ఈ డైరెక్టర్‌తో మరిన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ’’ అన్నారు టి. శివ. ‘‘పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులతో ‘పార్టీ’ చిత్రం తెరకెక్కింది. ప్రధానమంత్రి మోదీగారి స్పీచ్‌తో మొదలవుతుంది. ఇదే బ్యానర్లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వెంకట్ ప్రభు అన్నారు. ‘‘రమ్యకృష్ణగారిని రియల్‌గా చూడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా.. భయం కాదు కానీ బిడియంగా ఉంది’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. ‘‘పార్టీ’ చిత్రం ద్వారా మా మనవడిని పరిచయం చేస్తున్నారు. తప్పక ఆదరించాలి. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే. ఒరిజినల్‌గా అలా ఉండను’’ అన్నారు సత్యరాజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్‌జీ, నటి సంచిత తదితరులు పాల్గొన్నారు. -
పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే
ఆవారా, నా పేరు శివ, ఊపిరి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు కార్తీ. గతేడాది ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ ‘చినబాబు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా రైతు నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో రైతు గురించి చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే, నువు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే.. లాంటి డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందగా, 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. -
నిర్మాతగా శివకార్తికేయన్
తమిళసినిమా: కథానాయకుడిగా విజయ పథంలో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తాజాగా నిర్మాత అవతారమెత్తారు. తన మిత్రుడు అరుణ్రాజా కామరాజ్‌కు దర్శకుడిగా అవకాశం ఇస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాటతో గీత రచయితగా మంచి గుర్తుంపు తెచుకున్నారన్నది గమనార్హం. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆయనకు కూతురిగా ఐశ్వర్యారాజేశ్ నటిస్తున్నారు. ఇది క్రికెట్ క్రీడలో కూతురిని ప్రోత్సహించే తండ్రి ఇతి వృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శివకార్తికేయన్ చిత్ర వివరాలను తెలుపుతూ తనకు పేరు ప్రఖ్యాతులు అందించింది సినీ రంగమేనన్నారు. ఇక్కడ సాధించాలన్న కలలతో తిరుగుతున్నప్పుడు తనతో ఉన్న తన మిత్రుల కలలను అర్థం చేసుకోవడం తన బాధ్యతగా భావించానని అన్నారు. అరుణ్రాజా కామరాజ్ కథను చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను చాలా ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఇందులో సత్యరాజ్ తండ్రిగా, ఐశ్యర్యారాజేశ్ ఆయన కూతురిగా నటిస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య పాత్రలో నటించడానికి ఒక అందమైన నటుడు అవసరం అయ్యారని, ఆ పాత్రను తన సన్నిహితుడు దర్శన్ పోషిస్తున్నారని తెలిపారు. దీపు నీణన్ థామస్ సంగీతం, ధినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. సంగీతదర్శకుడు దీపు నీణన్, ఈ చిత్ర దర్శకుడు అరుణ్రాజా కామారాజ్, తాను ఒకే కళాశాల్లో చదువుకున్నామని, ముగ్గురిదీ ఒకే ఊరు అనీ అందుకే ఈ చిత్రాన్ని తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించామని శివకార్తీకేయన్ వివరించారు. -
కట్టప్ప ఈరోజైనా సీక్రెట్ చెబుతాడా..?
హైదరాబాద్: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ మూవీ చూసిన అందిరికీ అతిపెద్ద సందేహం వచ్చింది. సింహాసనానికి కట్టుబానిసగా ఉన్న కట్టప్ప(సత్యరాజ్) తనను మామ అంటూ ప్రేమగా పిలిచే బాహుబలి (ప్రభాస్)ని ఎందుకు చంపాడన్న ప్రశ్న తలెత్తింది. అయితే నేడు నగరంలో జరుగుతున్న బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాయంత్రం ప్రారంభమైంది. బాహుబలి టీమ్ అఫీషియల్ ట్విట్టర్ లో అభిమానులను మరోసారి ఊరించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ చర్చిస్తున్న ఓ ఫొటోను మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. కనీసం ఈరోజైనా కట్టప్ప.. బాహుబలిని చంపడం వెనక ఉన్న మర్మాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మనకు చెబుతాడా ఎదురుచూద్దాం అనే అర్థం వచ్చేలా వారి పోస్ట్‌లో రాసుకొచ్చారు. మూవీలోని ప్రధాన పాత్రధారులు అందరూ ఒక్కవేదిక వద్దకు రావడంలో బాహుబలి అభిమానులు ఎంతో హుషారుగా ఈవెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను బాహుబలి యూనిట్ వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేయనుండటం గమనార్హం. బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఫోటో గ్యాలరీ Maybe today will be the day Sathya Raj tells us, why Kattappa killed Baahubali… or maybe not… #Baahubali2PreReleaseEvent pic.twitter.com/X75dDafcRt — Baahubali (@BaahubaliMovie) 26 March 2017