
రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో కూలీ అనే భారీ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ శోభన.. రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో శృతిహాసన్ రజనీకాంత్‌కు కూతురిగా నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. ఇందులో రజనీకాంత్ గెటప్ ఆయన అభిమానులు అదుర్స్ అనేలా ఉంది.
38 ఏళ్ల తర్వాత..
ఇకపోతే ఇందులో నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తాజా సమాచారం. వీరిద్దరూ 38 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారన్నమాట. ఇంతకు ముందు రజనీకాంత్, సత్యరాజ్ కలిసి తంబిక్కు ఎంద ఊరు, మూండ్రు ముగం, పాయుం పులి, నాన్ సిగప్పు మణిదన్, మిస్టర్ భరత్ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నింటిలోనూ సత్యరాజ్ విలన్‌గానే నటించారు.
అప్పుడు తండ్రిగా.. ఇప్పుడు..
మిస్టర్ భరత్ చిత్రంలో రజనీకాంత్‌కు తండ్రిగా నటించారు. అందులో ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా అనే పాట సూపర్‌హిట్ అయ్యింది. తొలిసారిగా కూలీ చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడిగా పాజిటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. దీంతో పడయప్పతో కట్టప్ప అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కూలీ చిత్రానికి గిరీశ్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment