ఈ మధ్య ఎక్కడ చూసినా విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ విడాకులు తీసుకున్నాడు. మరోవైపు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా విడాకులు తీసుకోబోతున్నాడని తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ నటి దివ్య అగర్వాల్ కూడా ఇలానే చేయబోతుందని అన్నారు. ఇప్పుడు దీనిపై దివ్య ఘాటుగా స్పందించింది. పుకార్లు సృష్టిస్తున్న వాళ్లకు ఇచ్చిపడేసింది.
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్.. దాదాపు నాలుగేళ్ల పాటు సహనటుడు వరుణ్ సూద్‌ని ప్రేమించింది. కానీ మనస్పర్థల కారణంగా 2022లో వీళ్లు విడిపోయారు. కోరుకున్న విధంగా, సొంతంగా బతకాలని అనుకుంటున్నానని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తని బయటపెట్టింది. ఇది జరిగిన కొన్నాళ్లకు వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. అదే ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)
రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న దివ్య అగర్వాల్.. తనని అర్థం చేసుకునే భర్త దొరికాడని చెబుతూ పొంగిపోయింది. కానీ ఇంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయి మూడు నెలలు కాలేదు. ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేసింది. దీంతో ఈమె విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై ఆమె స్వయంగా ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది.
'దీని గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. 2500 పోస్టుల్ని నేను డిలీట్ చేశాను. కానీ మీడియా మాత్రం వాటిలో నా పెళ్లి గురించి మాత్రమే స్పందించింది. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చాలామంది ఊహించని విషయాల‍్ని నేను చేశాను. ఇప్పుడు వాళ్లు నా నుంచి పిల్లలు లేదా విడాకుల్ని కోరుకుంటున్నారా? అది అస్సలు జరగదు' అని దివ్య అగర్వాల్ ఫుల్ ఫైర్ అయింది.
(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment