Actor Sathyaraj Admitted In Chennai Hospital Due To Covid - Sakshi
Sakshi News home page

Actor Sathya Raj: లెజెండరి నటుడు సత్యరాజ్‌కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక

Jan 8 2022 8:27 AM | Updated on Jan 8 2022 6:47 PM

Actor Sathyaraj Joins In Chennai Hospital Due To Coronavirus - Sakshi

ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించనట్లు సమాచారం.

Legendary Actor Sathyaraj Hospitalized Suddenly Due To Coronavirus Positive: సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మంచు మనోజ్‌, లక్ష్మీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌లకు కరోనా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా లెజండరి నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌..

కాగా ఇంతకు ముందు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్‌ వడివేలు, చియాన్‌ విక్రమ్‌, అర్జున్‌, కమల్‌ హాసన్‌ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.  దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదే విధంగా సండే లాక్‌డౌన్‌ను కూడా విధించారు.  కరోనా కేసుల తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement