
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్
ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది.