పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌ | Sathyaraj forays into web series with The Perfect Husband | Sakshi
Sakshi News home page

పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌

Published Sat, Mar 21 2020 6:08 AM | Last Updated on Sat, Mar 21 2020 6:08 AM

Sathyaraj forays into web series with The Perfect Husband - Sakshi

‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్‌. ఆ సినిమా తర్వాత ఆయన ఎంత బిజీ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకూ పెద్ద తెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తొలిసారి ఓ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారు. ‘పర్ఫెక్ట్‌ హజ్బెండ్‌’ (పరిపూర్ణమైన భర్త) అనే వెబ్‌ సిరీస్‌లో సత్యరాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఇరట్టై సుళి’, ‘ఆన్‌ దేవదై’ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన తామిరా ఈ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధంతో ఈ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ఇందులో రేఖ, సీతా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ ఎనిమిది ఎపిసోడ్‌లు కొనసాగనుందట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement