శివకార్తికేయన్
తమిళసినిమా: కథానాయకుడిగా విజయ పథంలో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తాజాగా నిర్మాత అవతారమెత్తారు. తన మిత్రుడు అరుణ్‌రాజా కామరాజ్‌కు దర్శకుడిగా అవకాశం ఇస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాటతో గీత రచయితగా మంచి గుర్తుంపు తెచుకున్నారన్నది గమనార్హం. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆయనకు కూతురిగా ఐశ్వర్యారాజేశ్ నటిస్తున్నారు. ఇది క్రికెట్ క్రీడలో కూతురిని ప్రోత్సహించే తండ్రి ఇతి వృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శివకార్తికేయన్ చిత్ర వివరాలను తెలుపుతూ తనకు పేరు ప్రఖ్యాతులు అందించింది సినీ రంగమేనన్నారు. ఇక్కడ సాధించాలన్న కలలతో తిరుగుతున్నప్పుడు తనతో ఉన్న తన మిత్రుల కలలను అర్థం చేసుకోవడం తన బాధ్యతగా భావించానని అన్నారు.
అరుణ్‌రాజా కామరాజ్ కథను చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను చాలా ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఇందులో సత్యరాజ్ తండ్రిగా, ఐశ్యర్యారాజేశ్ ఆయన కూతురిగా నటిస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య పాత్రలో నటించడానికి ఒక అందమైన నటుడు అవసరం అయ్యారని, ఆ పాత్రను తన సన్నిహితుడు దర్శన్ పోషిస్తున్నారని తెలిపారు. దీపు నీణన్ థామస్ సంగీతం, ధినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. సంగీతదర్శకుడు దీపు నీణన్, ఈ చిత్ర దర్శకుడు అరుణ్‌రాజా కామారాజ్, తాను ఒకే కళాశాల్లో చదువుకున్నామని, ముగ్గురిదీ ఒకే ఊరు అనీ అందుకే ఈ చిత్రాన్ని తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించామని శివకార్తీకేయన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment