
నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. బాహుబలి చిత్రంతో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో తండ్రి పాత్రలతో చేసి మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక బాహుబలితో కట్టప్పగా నేషనల్ స్టార్‌గా మారారు. అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు.
అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కూతురు ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికే ఆయన కుమారుడు సిబిరాజ్ సినీరంగ ప్రవేశం చేశాడు. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించిన మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. స్టార్ నటుడి కూతురిగా మీడియా కంటపడకుండా పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తరచూ నెటిజన్లకు ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ సినీ ప్రియులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే తండ్రి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు తనకు తరచూ ఎదురవుతుంటాయట. దివ్య మాత్రం తన ప్రొఫెషన్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని, సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ సమాధానం ఇస్తుందని సన్నిహితుల నుంచి సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment