ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య సత్యరాజ్ ప్రముఖ న్యూట్రిషియన్.. ఆమె చాలా కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తను రాజకీయ రంగప్రవేశం చేస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఓ మీడియా ప్రకటన చేశారు. అందులో.. తనను చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేయడానికి కారణం ఏంటి? ఎంపీగా పోటీ చేస్తారా? మంత్రి పదవి కోసం రాయకీయాల్లోకి వస్తున్నారా? వంటి పలు ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొన్నారు.
రాజకీయ ఎంట్రీ నిజమే..
తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తానని చెప్పిన మాట నిజమేనని, అయితే ఏ పదవిని ఆశించో రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని, ప్రజలకు మంచి చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. తాను చాలా కాలంగా పేదలకు సేవలను అందిస్తూ వస్తున్నానని చెప్పారు. మహిళ్‌మతి ఇయక్కం పేరుతో మూడేళ్ల క్రితమే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తద్వారా తమిళనాడులోని నిరుపేదలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
అలాంటి పార్టీలో చేరే ఆలోచనే లేదు
అలాగే తనకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి పిలుపు వచ్చిందన్నారు. అయితే మతతత్వ పార్టీల్లో చేరే ఆలోచన తనకు లేదని, అలాగని తాను సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించనని చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఎన్నికలు ముగిసిన తరువాత వెల్లడిస్తానని దివ్య సత్యరాజ్ పేర్కొన్నారు. విప్లవ తమిళుడు సత్యరాజ్ కూతురిగా తమిళుల మంచి కోసం శ్రమిస్తానని ఆమె అన్నారు.
చదవండి: 'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment