అక్కా తమ్ముడైన అన్ని–మచ్చాన్‌ | jyothika, karthi new movie launch | Sakshi
Sakshi News home page

అక్కా తమ్ముడైన అన్ని–మచ్చాన్‌

Published Sun, Apr 28 2019 2:52 AM | Last Updated on Sun, Apr 28 2019 2:52 AM

jyothika, karthi new movie launch - Sakshi

నిజ జీవితంలో అన్ని (వదిన)– మచ్చాన్‌ (మరిది) జ్యోతిక–కార్తీ ఓ సినిమా కోసం అక్కాతమ్ముళ్లుగా మారారు. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్‌ ముఖ్య తారలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘‘అన్నితో తొలిసారి స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీతూగారితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇక మా టీమ్‌కు సత్యరాజ్‌ వంటి నటులు మరింత బలం’’ అని కార్తీ పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. సినిమాలో కార్తీ, జ్యోతికలకు సత్యరాజ్‌ తండ్రి పాత్ర చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement