కట్టప్ప ఈరోజైనా సీక్రెట్ చెబుతాడా..?
హైదరాబాద్: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ మూవీ చూసిన అందిరికీ అతిపెద్ద సందేహం వచ్చింది. సింహాసనానికి కట్టుబానిసగా ఉన్న కట్టప్ప(సత్యరాజ్) తనను మామ అంటూ ప్రేమగా పిలిచే బాహుబలి (ప్రభాస్)ని ఎందుకు చంపాడన్న ప్రశ్న తలెత్తింది. అయితే నేడు నగరంలో జరుగుతున్న బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాయంత్రం ప్రారంభమైంది. బాహుబలి టీమ్ అఫీషియల్ ట్విట్టర్ లో అభిమానులను మరోసారి ఊరించింది.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ చర్చిస్తున్న ఓ ఫొటోను మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. కనీసం ఈరోజైనా కట్టప్ప.. బాహుబలిని చంపడం వెనక ఉన్న మర్మాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మనకు చెబుతాడా ఎదురుచూద్దాం అనే అర్థం వచ్చేలా వారి పోస్ట్‌లో రాసుకొచ్చారు. మూవీలోని ప్రధాన పాత్రధారులు అందరూ ఒక్కవేదిక వద్దకు రావడంలో బాహుబలి అభిమానులు ఎంతో హుషారుగా ఈవెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను బాహుబలి యూనిట్ వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేయనుండటం గమనార్హం.
బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఫోటో గ్యాలరీ
Maybe today will be the day Sathya Raj tells us, why Kattappa killed Baahubali… or maybe not… #Baahubali2PreReleaseEvent pic.twitter.com/X75dDafcRt
— Baahubali (@BaahubaliMovie) 26 March 2017