► ‘అతడు’ సినిమాలో మహేశ్‌బాబు తాతగా నాజర్ నటించారు. కానీ ఆ పాత్రకు మొదట అనుకొన్నది ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోని. ఎవరా హీరో?
ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) శోభన్‌బాబు సి) కృష్ణ డి) కాంతారావు
► ‘ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్‌గానే ఉంటుంది. కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది’ అనే ౖyð లాగ్ రాసిన రచయిత ఎవరు?( చిన్న క్లూ... ఈ ౖyð లాగ్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలోనిది)
ఎ) బుర్రా సాయిమాధవ్ బి) పరుచూరి బ్రదర్స్ సి) క్రాంతిమాధవ్ డి) రత్నంబాబు
► ‘ఛమక్ ఛమక్ ఛం చుట్టుకో చుట్టుకో చాన్స్ దొరికెరో ఛయ్యా’ అంటూ సాగే ఈ పాటను ‘ఇంటిలిజెంట్’ సినిమాలో రీమిక్స్ చేశారు యస్.యస్. తమన్. ఈ పాటకు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఎ) ఇళయరాజా బి) కేవీ మహదేవన్ సి) రాజ్–కోటి డి) దేవా
► ‘కళ్లు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామెన్? ఎవరతను? (చిన్న క్లూ అతను ‘సిరిÐð న్నెల’ చిత్రానికి కెమెరామెన్)
ఎ) వీయస్సార్ స్వామి బి) ఛోటా. కె నాయుడు సి) యం.వి. రఘు డి) ఎస్. గోపాల్‌రెడ్డి
► ‘దశావతారం’ చిత్రంలో కమల్‌హాసన్ పది పాత్రలు పోషించిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఇందులో 7 పాత్రలకు డబ్బింగ్ చెప్పారు ఈ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎవరతను?
ఎ) సాయికుమార్ బి) యస్పీ బాలసుబ్రమణ్యం సి) శివాజీ డి) జీవీజీ రాజు
► యస్.యం.యస్ (శివ మనసులో శ్రుతి) చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు సధీర్‌బాబు. అదే చిత్రం ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేసిన హీరోయిన్ ఎవరు?
ఎ) కేథరిన్ బి) రెజీనా సి) ప్రణీత డి) నిత్యామీనన్.7
► ‘వీరబాహు సత్యధర్మ శివ శంకర రామ బాలు మహేంద్ర’...ఇది సుకుమార్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో హీరో పాత్ర పేరు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఎ) అల్లు అర్జున్ బి) రామ్ సి) నాగచైతన్య డి) రాజ్‌తరుణ్
► హీరో నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా మూడుసార్లు ఒక హీరోయిన్ మాత్రమే నటించారు. ఎవరా హీరోయిన్?
ఎ) తమన్నా బి) అమలాపాల్ సి) కాజల్ అగర్వాల్ డి) సమంత9
► ‘పరేషానురా పరేషానురా’ అంటూ ‘ధృవ’ చిత్రంలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు. ఆ పాట రచయిత ఎవరో కనుక్కోండి?
ఎ) చంద్రబోస్ బి)‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిసి) వరికుప్పల యాదగిరి డి) రామజోగయ్య శాస్త్రి
► యస్.యస్.రాజమౌళి తన కెరీర్‌లో ఒకే ఒక చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) స్టూడెంట్ నం.1 బి) సై సి) మగధీర డి) రాజన్న
► ప్రముఖ నటి శ్రియ ఏ నాట్య విభాగంలో విధ్యన భ్యసించారో తెలుసా?
ఎ) కూచిపూడి బి) భరతనాట్యం సి) కథక్ డి) కథక్కళి
► ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు.. ఈ మూడు సినిమాలు 2000 సంవత్సరంలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఆ మూడు సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే. ఎవరా బాలీవుడ్ భామ?
ఎ) మనీషా కొయిరాలా బి) సొనాలీ బింద్రే సి) నమ్రతా శిరోద్కర్ డి) టబు
► హీరోయిన్ శ్రీదేవి నటించిన ‘మామ్’ ఆమెకు ఎన్నో సినిమానో తెలుసా?
ఎ) 300 బి) 200 సి) 250 డి) 350
► నటుడు సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు? తెలుగులో నటించిన టాలీవుడ్ నటుడెవరో లె లుసా?
ఎ) చిరంజీవి బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) బాలకృష్ణ
► శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘అనామిక’ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించారో గుర్తుందా?
ఎ) శ్రియ బి) అంజలా జవేరి సి) నయనతార డి) కమలినీ ముఖర్జీ
► ‘కళ్లు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామెన్? ఎవరతను? (చిన్న క్లూ అతను ‘సిరిÐð న్నెల’ చిత్రానికి కెమెరామెన్)
ఎ) వీయస్సార్ స్వామి బి) ఛోటా. కె నాయుడు సి) యం.వి. రఘు డి) ఎస్. గోపాల్‌రెడ్డి
► పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రంలో హీరో పేరేంటో తెలుసా?
ఎ) ఆకాశ్ బి) వరుణ్‌తేజ్ సి) సత్య డి) రోషన్
► నటుడు సూర్య ఆర్థికంగా లేనివారు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ పేరేంటి?
ఎ) అగరం ఫౌండేషన్ బి) హెల్ప్ ఫౌండేషన్ సి) ఏకం ఫౌండేషన్ డి) స్వామినాథన్ షౌండేషన్
► కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ స్టిల్ ఏ సినిమాలోదో కనుక్కోండి?
ఎ) సాగర సంగమం బి) స్వాతిముత్యం సి) సిరిసిరిమువ్వడి) శంకరాభరణం
► ఈ పై ఫొటోలోని బుడతడు ఇప్పుడు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరో. ఇతనెవరబ్బా? ఓ నిమిషం ఆలోచించండి?
ఎ) రామ్‌చరణ్ బి) సాయిధరమ్ తేజ్ సి) యన్టీఆర్ డి) వరుణ్‌తేజ్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) బి 2) ఎ 3) ఎ 4) ఎ 5) బి 6) బి 7) సి 8) డి 9) సి 10) డి
11) సి 12) బి 13) ఎ 14) బి 15) సి 16) సి 17) ఎ 18) ఎ 19) సి 19) సి 20) డి
Comments
Please login to add a commentAdd a comment