
నయనతార
స్క్రిప్ట్‌కి సరిపడినప్పుడు పాత సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడుతుంటారు. 1981లో రజనీకాంత్ నటించిన ‘వెట్రికన్’ టైటిల్‌ను ఇప్పుడు నయనతార సినిమాకు పెట్టారు. సూపర్‌స్టార్ టైటిల్‌ను ఏ సినిమాకైనా వాడేస్తే అభిమానుల్లో చిన్న నిరుత్సాహం ఉంటుంది. కానీ, రజనీ సూపర్‌స్టార్, నయనతార లేడీ సూపర్‌స్టార్. సొ.. నో ప్రాబ్లమ్ అనుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్. ‘అవల్’ (తెలుగులో గృహం) తెరకెక్కించిన మిలింద్ రావ్ దర్శకత్వంలో నయన తార ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా ‘వెట్రికన్’(మూడో కన్ను అని అర్థం). నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. టైటిల్ బ్రెయిలీ లిపిలో రాసి ఉండటంతో సినిమాలో నయనతార అంధురాలిగా నటించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.