సరైనోడు వీడే | Jeeva, Nayanthara new movie Veedu Sarrainodu | Sakshi
Sakshi News home page

సరైనోడు వీడే

Published Tue, Aug 6 2019 2:50 AM | Last Updated on Tue, Aug 6 2019 2:50 AM

Jeeva, Nayanthara new movie Veedu Sarrainodu - Sakshi

జీవా, నయనతార

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని ‘వీడే సరైనోడు‘ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. కోకా శిరీష సమర్పణలో నోవా సినిమాస్‌ పతాకంపై జక్కుల నాగేశ్వరావు ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు.  జక్కుల నాగేశ్వరావు మాట్లాడుతూ – ‘‘గ్రామీణ, నగర నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. జీవా నటన, నయనతార గ్లామర్‌ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ప్రస్తుతం సెన్సార్‌ పూర్తయింది.  ఈనెల 8న పాటలు విడుదల చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్‌ దేవా, సహ నిర్మాతలు: మాస్టర్‌ కోకా లోహితా„Š  – మాస్టర్‌ కోకా నిశ్చల్‌ సాయికృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement