తమిళసినిమా: మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థగా పేరుపొందిన సంస్థ పొటాన్షియల్ స్టూడియోస్. మాయ, మానగరం, మాన్‌స్టర్, టాణాక్కారన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన సంస్థ ఇది. తాజాగా నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో జీవాకు సంబంధించిన పార్ట్ పూర్తి అయింది. త్వరలోనే తుది షెడ్యూల్ నిర్వహించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలిపారు. కాగా ఇదే సంస్థలో జీవా హీరోగా మరో చిత్రంలో నటిస్తున్నారు.
ఇందులో నటి తాన్య రవిచంద్రన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు మణికంఠన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి గోకుల్ ఫినాయ్ చాయాగ్రహణం, నివాస్ కే.ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలను బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి చెన్నై పరిసర పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment