
Methil Devika Divorce with Mukesh: పాపులర్ మలయాళ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడాకులు తీసుకోనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డ్యాన్సర్ దేవిక మీడియాముఖంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ముఖేశ్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. అందుకే అతడితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యానని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల నేను, నా భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఈ విషయంలో ముఖేశ్ అభిప్రాయమేంటో నాకు తెలియదు. కానీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి.
నేను అతడి పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించేంత అవసరం, ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విడాకులకు సంబంధించి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని ముఖేశ్ పేర్కొన్నాడు.
కాగా నటుడు, నాయకుడైన ముఖేశ్‌కు గతంలో నటి సరితతో పెళ్లైంది. అయితే ముఖేశ్ తాగుబోతు అని, పలువురు మహిళలతో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో సరిత 2011లో భర్తకు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ జంట కూడా ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతుండటంతో అభిమానులు షాకవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment