ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ వివాహబంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. భార్య బబితకు విడాకులిచ్చినట్లు తెలిపాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆయన మాట్లాడుతూ.. 'నేను మలయాళ నటుడు వినాయకన్‌ను. నాకు, నా భార్యకు ఉన్న దాంపత్య బంధం ఇంతటితో ముగిసింది' అని చెప్పుకొచ్చాడు.
కాగా గతేడాది మీటూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు వినాయకన్. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే.. నేను దానిని అలాగే కొనసాగిస్తాను. నిజంగా అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నాను' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో క్షమాపణలు కోరాడు నటుడు. 2019లోనూ మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు.
ఇకపోతే 1995లో వచ్చిన మోహన్‌లాల్ 'మాంత్రికం' చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. కమ్మటిపాదం సినిమాకు గానూ 2016లో కేరళ స్టేట్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా మూవీ జైలర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆఖరిదశలో ఉంది. మలయాళంలో కరింతాండన్ చిత్రం చేస్తున్నాడు. తమిళంలో నటించిన ధృవ నక్షత్రం ఎన్నో ఏళ్ల తర్వాత రిలీజ్‌కు నోచుకుంటోంది. ఈ మూవీ మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment