సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్ | Sesa Sterlite develops cold setting cement free Green Concrete | Sakshi
Sakshi News home page

సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్

Published Sat, Jun 28 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్

సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్

 కాలుష్య రహితం.. ఇసుక అవసరం లేదు.. అతి తక్కువ ఖర్చు

రాయగడ (ఒడిశా): ఇసుక అవసరం లేదు.. కాలుష్యానికి తావులేదు.. అతి తక్కువ నీటి వినియోగం, తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వేదాంత గ్రూప్ కంపెనీ సెసా స్టెరిలైట్ శ్రీకారం చుట్టింది.  పరిశోధనలు ముగించుకుని మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతున్న గ్రీన్ సిమెంట్ గురించి సెసా స్టెరిలైట్ సంస్థ సీఈవో డాక్టర్ ముకేశ్ కుమార్ వినియోగం గురించి వివరించారు.  రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో గల లంజిగడలోని సెసా స్టెరిలైట్ కంపెనీ ఐఎంఎంటీ, భువనేశ్వర్ సాంకేతిక సహకారంతో గ్రీన్ సిమెంట్‌కు రూపకల్పన చేసింది.
 
దీని తయారీకి ఇనుము తయారీ కంపెనీల్లో వృథాగా ఉండే రెడ్‌మార్ట్ మెటీరియల్ తో పాటు పలు కంపెనీల్లో నిరర్థక పదార్థమైన బూడిదను వినియోగించారు. ఇందులో 90 శాతం బూడిద, ఒక శాతం సున్నం, మూడు శాతం కెమికల్ ఉన్నాయని ముకేశ్ తెలిపారు.  ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్ పనుల్లో 21 రోజులు వాటరింగ్ చేస్తుండగా, గ్రీన్‌సిమెంట్‌తో చేపట్టే కాంక్రీట్ పనులకు ఒక్కసారి మాత్రమే నీటిని వినియోగిస్తారు. దీని వినియోగంలో నీరు వృథా కాదని తెలిపారు. సాధారణ సిమెంట్ కన్నా 30 శాతం ఖర్చు తక్కువని తెలిపారు. దీని వినియోగానికి ఇసుక అవసరం లేదని చెప్పారు. మరో 8 నెలల్లో దీనిని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement