Sesa Sterlite
-
భూ అధ్యయనానికి నాసా ‘గోల్డ్ మిషన్’
వాషింగ్టన్: భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్ఈఎస్–13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి ప్రయోగిస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు. భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పుల్ని ఈ మిషన్ అంచనావేస్తుంది. భూవాతావరణం, అంతరిక్షం కలిసే ఈ ప్రాంతంలో విద్యుదయస్కాంత అణువులతో కూడిన అయనోస్పియర్, తటస్థ వాతావరణంతో కూడిన థర్మోస్పియర్‌లు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జీపీఎస్ వ్యవస్థ, రేడియో సిగ్నల్స్ల్ని ప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ‘గోల్డ్’ వ్యవస్థలో తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. భూవాతావరణం చివరి పొరల్లో అస్థిర పరిస్థితులు ఉన్నాయని, అక్కడ జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకోలేదని గోల్డ్ మిషన్‌లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త చెప్పారు. -
సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్
కాలుష్య రహితం.. ఇసుక అవసరం లేదు.. అతి తక్కువ ఖర్చు రాయగడ (ఒడిశా): ఇసుక అవసరం లేదు.. కాలుష్యానికి తావులేదు.. అతి తక్కువ నీటి వినియోగం, తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వేదాంత గ్రూప్ కంపెనీ సెసా స్టెరిలైట్ శ్రీకారం చుట్టింది. పరిశోధనలు ముగించుకుని మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న గ్రీన్ సిమెంట్ గురించి సెసా స్టెరిలైట్ సంస్థ సీఈవో డాక్టర్ ముకేశ్ కుమార్ వినియోగం గురించి వివరించారు. రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో గల లంజిగడలోని సెసా స్టెరిలైట్ కంపెనీ ఐఎంఎంటీ, భువనేశ్వర్ సాంకేతిక సహకారంతో గ్రీన్ సిమెంట్‌కు రూపకల్పన చేసింది. దీని తయారీకి ఇనుము తయారీ కంపెనీల్లో వృథాగా ఉండే రెడ్‌మార్ట్ మెటీరియల్ తో పాటు పలు కంపెనీల్లో నిరర్థక పదార్థమైన బూడిదను వినియోగించారు. ఇందులో 90 శాతం బూడిద, ఒక శాతం సున్నం, మూడు శాతం కెమికల్ ఉన్నాయని ముకేశ్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్ పనుల్లో 21 రోజులు వాటరింగ్ చేస్తుండగా, గ్రీన్సిమెంట్తో చేపట్టే కాంక్రీట్ పనులకు ఒక్కసారి మాత్రమే నీటిని వినియోగిస్తారు. దీని వినియోగంలో నీరు వృథా కాదని తెలిపారు. సాధారణ సిమెంట్ కన్నా 30 శాతం ఖర్చు తక్కువని తెలిపారు. దీని వినియోగానికి ఇసుక అవసరం లేదని చెప్పారు. మరో 8 నెలల్లో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు.