వాషింగ్టన్: భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్‌ఈఎస్–13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి ప్రయోగిస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు.
భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పుల్ని ఈ మిషన్ అంచనావేస్తుంది. భూవాతావరణం, అంతరిక్షం కలిసే ఈ ప్రాంతంలో విద్యుదయస్కాంత అణువులతో కూడిన అయనోస్పియర్, తటస్థ వాతావరణంతో కూడిన థర్మోస్పియర్‌లు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జీపీఎస్ వ్యవస్థ, రేడియో సిగ్నల్స్‌ల్ని ప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ‘గోల్డ్’ వ్యవస్థలో తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. భూవాతావరణం చివరి పొరల్లో అస్థిర పరిస్థితులు ఉన్నాయని, అక్కడ జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకోలేదని గోల్డ్ మిషన్‌లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment