నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సిమెంట్
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు.
ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట.
సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్‌ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి.
ఉక్కు (స్టీల్)
సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది.
ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది.
ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!
రంగాల వారీగా రికవరీ రేట్లు
ఇసుక
నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment