
న్యూఢిల్లీ: నిర్భయ హత్య కేసులో దోషిగా తేలిన ముకేశ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని కోర్టును కోరాడు. ఈ కేసులో మే 5న నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో, ఆ తరువాత అప్పీల్ కోర్టులో తాను లేవనెత్తిన పలు విషయాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదని అతడు తన తాజా పిటిషన్‌లో ఆరోపించాడు.