సరిత... నేను చట్టబద్ధంగా విడిపోయాం
‘మేం చట్టబద్ధంగా విడిపోయాం’ అంటున్నారు నటి సరిత భర్త ముఖేష్. వివాహ రద్దు జరగకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటారని నటి సరిత, తన భర్త ముఖేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటి సరిత ఆరోపణల్ని ఖండించిన ముఖేష్, ఆమె ఆరోపణలు సత్యదూరం అన్నారు. తాము చట్టబద్ధ్దంగా విడిపోయామని, ఆ ఆధారాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించిన తర్వాతనే తాను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తగిన ఆధారాలు, డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించకుంటే రెండో వివాహానికి రిజిస్ట్రార్ అనుమతించేవారా అంటూ ముఖేష్ ప్రశ్నించారు.