
రిలయన్స్ ముకేశ్ సంచలన వరాలు
ముంబై : టెలికాం కంపెనీలకు షాకిస్తూ ఇటీవలే రిలయన్స్ ఫ్యామిలీలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను ముకేశ్ అంబానీ వెల్లడించారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన యూజర్లపై వరాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు దేశంలో జియో సేవలను అందుబాటులోకి తెస్తున్నామంటూ ముకేశ్ ప్లాన్ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సర్వీసులను అంకితం చేయనున్నట్టు తెలిపారు. తమ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్ కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్గా రూపాంతరం చెందబోతోందన్నారు. ఈ క్రమంలో తమ జియో పాత్ర కీలకమనిచెప్పారు.వచ్చే ఏడాది లోగా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
నెటవర్క్, మొబైల్స్, అప్లికేషన్స్ అనే మూడు పిల్లర్స్ గా తమకార్యకలాపాలను విస్తరించనుంది. ఆధార్ కార్డ్ కాపీ తీసుకొని వస్తే కేవలం పదిహేను నిమిషాల్లో సిమ్ కార్డ్ అందిస్తామన్నారు. రిలయన్స్ సంచలన జియో సేవలు సెప్టెంబర్ 5 న గా లాంచ్, డిశెంబర్ 31 కమర్షియల్ గా లాంచ్ కానున్నట్టు తెలిపారు. డిజిటల్ ఇండియాలో విద్యార్థులకు అదనంగా డాటా ను అందజేయనున్నామని వివరించిన ముకేశ్ , స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉంటే మరో 25 శాతం డేటా ఉచితంగా అందిస్తామన్నారు.
దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఉన్నామన్నారు. అత్యధిక క్వాలిటీ వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీలో లీడర్లుగా ఎదుగుతామనీ, పండుగ రోజుల్లో మెసేజ్ ల బ్లాకేజ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామన్నానీ, 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కే జీబీ డేటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 300 పైగా ఛాన ల్స్ లైవ్ లో చూడొచ్చు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, ఉచితంగా 60 వేల మ్యూజిక్ వీడియోలు , పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు.