
న్యూఢిల్లీ : ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి వెళ్లిన సంఘటన కలకలం రేపింది. మెటల్ గ్రిల్స్ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అంతేకాకుండా సింహానికి దగ్గరగా వెళ్లి దాని ముఖంలో ముఖం పెట్టి చూశాడు. నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాలు విసిరాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగినప్పుడు జూ లో ఉన్న సందర్శకులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తిని బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌గా గుర్తించామన్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని తెలిపారు. అయితే జూ సిబ్బంది అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటకు తీసుకోచ్చారని వెల్లడించారు. అయితే అత్యంత పటిష్టంగా ఉండాల్సిన మెటల్ గ్రిల్స్ దాటి ఓ వ్యక్తి లోనికి వెళ్లడంతో.. జూ అధికారులపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment